30, మార్చి 2012, శుక్రవారం
19, మార్చి 2012, సోమవారం
14, మార్చి 2012, బుధవారం
10, మార్చి 2012, శనివారం
date 10 - 03 - 2012, T.2;45pm
రచన12 m (2) T (17)
సింహాచలం లక్ష్మణ్ స్వామి ,
జగిత్యాల , కరీంనగర్ జిల్లా ..
రచన12 m (2) T (17)
సింహాచలం లక్ష్మణ్ స్వామి ,
జగిత్యాల , కరీంనగర్ జిల్లా ..
....బాటసారి ...
ఎడతెగని ఈయానం అనంతమైనది ...
యుగ సంధ్యలమధ్య పురాతన స్మృతుల యాత్ర ...
అమెజాన్ కికారణ్యాల గుండా ...
వడివడిగా సవ్వడి చేస్తూ ...
సింధూలోయ నుండి ..
తక్షశిల వక్షస్థలం దాటేస్తూ ..
కాందహార్ కొండల్లో పరచుకున్న చీకటిని చిదుముకుంటూ,
ఆటనై.. పాటనై..సెలయేటి ఊటనై...
మహిమ హిమాలయాన్ని స్పృశిస్తూ ...
మంచుపూల వృక్షం పై నున్న
హిమ ఖేచరాల్ని ఎగరేస్తూ ...
కరిగి నీరై... కన్నీరై ...పన్నీరై ..
ఉత్తుంగ తరంగ గంగనై
బంగాళా ఖాతం వరకు..
నాప్రస్థానం సాగుతూనే ఉంది ..
ఎడారి ఒయాసిస్సునై
ఎండమావుల్ని తరిమేస్తూ ...
మూగవాని వేణు గానాన్నై,
అలనై.. కలనై..కొలను కమాలాన్నై...
పరిమళ సుగంధాల నా ప్రయాణం
ప్రణయ యానంగా మారుతోంది ...
*** *** *** ***
అలసి సొలసి ఏ ముళ్ళ పొదలపై
చిద్రమైన వెన్నెలనైనప్పుడు
అమ్మ గుర్తొస్తుంది ...!!!
ఒంటరితనం గుండెల్లో గునపమవుతుంది !
నాగరికత నరక కూపం నుండి
అటో... ఇటో ...ఎటో ...ఏ ఖండాంతరాల
ఒంటరి ద్వీపానికో వలస వెళ్ళాలని ..
గుండె చూరికి వేళ్ళాడే చీకటి గబ్బిలం
ఎప్పుడు వెళుతుందో ఏమో !!
గాయాల గతపు లావాపై
ఎవరెస్ట్ ని కుమ్మరిస్తున్నాను ..
పట్టి పీడిస్తున్న వేదనల్ని ఫసిఫిక్ లో ముంచేస్తున్నాను
భయానక తిమిర తిమింగలానికి
ఈ చిట్టి చేప ఏదో ఒక రోజు బలైపోక తప్పదు!!
చీకటి గుహలో వెలుగుతున్న చిరు దీపం
మృత్యు తుఫానుకి ఆరిపోక తప్పదిక !!!
తిరిగి తిరిగి మళ్లీ చిట్ట చివరి మజిలీ
అమ్మను చూడకుండానే -
ఆది మానవ శిలాజమై అంతర్ధానమై పోతుంది ..!!!!
మళ్ళీ జన్మంటూ ఉంటే...
ఈ నేలమీదే పోన్నపూల చెట్టునై
పుట్టాలని ఉంది ప్రభూ ...!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)


