24, ఫిబ్రవరి 2012, శుక్రవారం











           ‎"date 22 - 02 - 2012, T.6;45pm



సింహాచలం లక్ష్మణ్ స్వామి ,

జగిత్యాల , కరీంనగర్ జిల్లా ..






**** నిత్య చైతన్య స్రవంతి ...***






ఈ పాపాల పాముల పుట్టల్ని...

 పక్కకు విసిరి ...

వికసిత విరుల సిరుల లోగిళ్ళలోకి ...

నవ కవన దివికి

కనక తారనై ...ప్రవేశిస్తాను ...!

దారాలు కనపడవు ...గాలి పటాలు తప్ప ..

కొమ్మలు కనపడవు.. పూల బొమ్మలు తప్ప ..

అక్షర గవాక్షాల్లోనుండి ...హంసలు

ఎగురుతూ ఉంటాయి ...చంద్ర హారాలై ...

ఎడారిమల్లెల వర్ష హర్షాలు..!

వెంట వచ్చే వేధనల్ని తరిమే ..చంద్రహాసాలకి ..

కొదవలేదిక్కడ...

పురిటి నొప్పులబాధ (ఇష్టమైన )

తల్లులకేకాదు...

అక్షర జనకులకు కూడా....!!!

ప్రకృతిని మొత్తం ...

చుట్టేయాలని ...

అక్షరాల ఆలమందలతో...

అలుపెరుగని యాత్ర ....!

పంచ భూతాలని చుట్ట చుట్టి ...

ఏటి గట్టున పెట్టి ...

గవ్వలని ఏరుకుంటాను..!!

ఏకొమ్మ పూలో ఎంత అందంగా ఉన్నాయి..!!

ఈ అక్షరాలే ...

మమతను సమతను మానవతను ..

పంచె, పెంచే అంకురాలు కావాలు ...

భావి జీవన వట వృక్షాలై ....విస్తరించాలి ...





                     సింహాచలం లక్ష్మణ్ స్వామి ,

                          జగిత్యాల , కరీంనగర్ జిల్లా ..


                               date 08 - 02 - 2012, T.7;15pm


*****ఆరోజు రాత్రి  అడవిలో ..****.

చుట్టూ  పరుచుకుంటున్న చీకటి 
క్రమంగా ...గుండెలోకి  పాకింది ...
గాలికి వణుకుతున్న తరువులు ...
నాలోకి భయానకపు ఆకుల్ని  రాలుస్తున్నాయి ...
బహుశా  ఇదే ఆఖరి రాత్రేమో ...
భయమంటే ఏంటో ...తెలుస్తోందిప్పుడే ...
తరువుల తనువులు తడుముతూ ..
ఏటవాలుగా వెన్నెల జాలువారుతోంది ....
లోయలోనుండి ..'నైటెంగేల్..' మృత్యు గీతమాలపిస్తుంది ...!
గుడ్లగూపల ఘీంకారాలు ..............
దివిటీలు పట్టుకు తిరుగుతున్న మిణుగురులు ...
చరాచరం  సద్దుమనిగినా...  నిశాచర ప్రాణికోటి నిద్ర లేచింది ...
గాజుల్ని  మరిపిస్తూ గలగలల సెలయేటి సవ్వళ్ళు ...
వనదేవత మువ్వల్లా ....
కొమ్మల కొంగునుండి...రాలుతున్న వెండి వెన్నెల దారలు..
మాటిమాటికి పలకరిస్తున్న మళయ మారుతం ..
ఎటని వెళ్ళను...!
ఎడతెగని కీకారణ్యంలో ....
ఏ మృగం వరించనుందో...ఈ దేహాన్ని ...?!
కొండమల్లి పూలగంధం ...
కొండగోగుపూలందం...డెందము నందు 
జన్మజన్మల మందహాసం ...!!
భయాన్ని బయటకి విసిరేసి ...
మాటలకందని ఈ వన యామిని సౌందర్యాన్ని ...
వదిలిపెట్టను ...
'ఆకులో ఆకునై  పువ్వులో పువ్వునై '
ఈ అడవి పిట్టనై ...మట్టినై....
ఈ తల్లి ఒడిలో కన్ను మూయాలని ....!
కలి కాలపు  విష లోకపు మానవ మృగాల కన్న...
ఈ వన మృగాలకు ...నైవేద్యాన్నవుతా ....
పూల మకరందాన్ని గ్రోలుతూ  భ్రమరాలు ...
స్వేచ్చగా  విహరిస్తున్నై ....
తూనిగానై  ఈనిషి రేయి 
అడవినంతా గాలిస్తా ...
విధాత విలాసాన్ని చూడాలంటే ....
ఎన్ని జన్మలు కావాలో మనకు ....
పంచభూతాత్మక ప్రాణికోటి ...
యుగధర్మం పాటిస్తూ సాగిపోతోంది ...
కానీ మనిషిమాత్రం ....
నయవంచనతో ప్రపంచాన్ని అంతం చేసే 
పనిలో పడ్డాడు ...
మొద్దు నిద్రను నిద్రపుచ్చాను ...
పిలిచేదాకా రావొద్దని ...
మిణుగుర్లని వెంటేసుకుని ...
ఈ వనమంతా  చుట్టేస్తా...
అడవితల్లి వొడిలో అమరున్నైన ....
లేక అభిమన్యున్నైనా....
నా యానం సాగుతూనే ఉంటుంది ....!!! 
(  ఒక రోజు   వనమూలికల కోసం కరీంనగర్ జిల్లా పెద్దపల్లి దగ్గరలో ఉన్న రామగిరి ఖిల్లా కి వెళ్ళాం ..
ఎత్తైన కొండ దట్టమైన అడవి ...దారి తప్పాం....రాత్రంతా ...అడవిలో ఒంటరి పోరాటం ...
మృత్యు ఒడిలోనుండి కిందకు దిగేసరికి  తెల్లవారింది !?...ఒక భయానక అందమైన జ్ఞాపకం నా జీవితంలో ...మధుర స్మృతిగానే ఉంటుంది ..
.నా కవితలకు ప్రేరణనిస్తూనే ఉంటుంది ...)
 .................................  డా .సింహా చలం లక్ష్మణ్ స్వామి , జగిత్యాల .