24, ఫిబ్రవరి 2012, శుక్రవారం











           ‎"date 22 - 02 - 2012, T.6;45pm



సింహాచలం లక్ష్మణ్ స్వామి ,

జగిత్యాల , కరీంనగర్ జిల్లా ..






**** నిత్య చైతన్య స్రవంతి ...***






ఈ పాపాల పాముల పుట్టల్ని...

 పక్కకు విసిరి ...

వికసిత విరుల సిరుల లోగిళ్ళలోకి ...

నవ కవన దివికి

కనక తారనై ...ప్రవేశిస్తాను ...!

దారాలు కనపడవు ...గాలి పటాలు తప్ప ..

కొమ్మలు కనపడవు.. పూల బొమ్మలు తప్ప ..

అక్షర గవాక్షాల్లోనుండి ...హంసలు

ఎగురుతూ ఉంటాయి ...చంద్ర హారాలై ...

ఎడారిమల్లెల వర్ష హర్షాలు..!

వెంట వచ్చే వేధనల్ని తరిమే ..చంద్రహాసాలకి ..

కొదవలేదిక్కడ...

పురిటి నొప్పులబాధ (ఇష్టమైన )

తల్లులకేకాదు...

అక్షర జనకులకు కూడా....!!!

ప్రకృతిని మొత్తం ...

చుట్టేయాలని ...

అక్షరాల ఆలమందలతో...

అలుపెరుగని యాత్ర ....!

పంచ భూతాలని చుట్ట చుట్టి ...

ఏటి గట్టున పెట్టి ...

గవ్వలని ఏరుకుంటాను..!!

ఏకొమ్మ పూలో ఎంత అందంగా ఉన్నాయి..!!

ఈ అక్షరాలే ...

మమతను సమతను మానవతను ..

పంచె, పెంచే అంకురాలు కావాలు ...

భావి జీవన వట వృక్షాలై ....విస్తరించాలి ...



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి